Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday 15 October 2016

October fest, Germany (అక్టోబర్ ఫెస్ట్, జర్మనీ )


అక్టోబర్ ఫెస్ట్ ప్రతి ఏటా మ్యూనిచ్ (జర్మనీ) నగరంలో జరిగే జానపద ఉత్సవం.ఇది ప్రపంచం లోనే అత్యంత పెద్దదైన ఉత్సవం , ప్రతి ఏటా అక్టోబర్ నెలలో 17 లేక 18 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ పెద్దపెద్ద చెక్క డేరాలులో(టెంట్ ) బీర్ అమ్ముతారు. ఈ బీరుని వారి సంప్రదాయమైన గుర్రపు బళ్ళలో తెస్తారు . ఈ ఫెస్ట్ ప్రారంభ రోజున ఒక పెద్ద పెరేడ్ జరుతుంది, ఇందులో సుమారు 1000 మంది కళాకారులు పాల్గొంటారు. వీరు రక రకాల వేషాలతో అలంకరించుకుని  పిల్లలకి చాక్లెట్లు ,పెద్దలకి బీరు లేక వైన్ ఇస్తూవుంటారు . ఈ  పెరేడ్ చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది . ఒక్కో బీరు టెంటులో  సుమారు 15000 నుండి 30000 మంది ఉంటారు .టెంటులోని  బ్యాండ్ సంప్రదాయమైనటువంటి బవేరియన్ రాష్ట్ర గీతాలు పాడుతూ ఉంటారు, అవి విని జనం ఉత్సాహంతో డాన్సులు చేస్తూ బీర్ గ్లాస్సుల్ని అత్యంత వేగంతో చీర్స్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు.మీరు ఆల్కహాల్ స్వీకరించనట్లైతే మీకోసం ఆల్కహాల్ ఫ్రీ బీర్ ఉంటుంది . అంతమంది జనాన్ని ఆ కోలాహలాన్ని చూస్తే  కన్నులకు పండగే అనుకోండి .ఈ ఫెస్ట్ కి వచ్చే వాళ్ళు జర్మన్ల యొక్క సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. మగవాళ్ళు షర్ట్ మరియు లెదర్ ప్యాంటు లేక షార్ట్ వేసుకుంటారు, దానిని వారి భాషలో లెదర్ హోసే అంటారు. ఆడవాళ్ళూ మోకాళ్ళ దాక ఉండే గౌన్ వేసుకుంటారు, దాన్ని జర్మన్ భాషలో డ్రిండిల్ అంటారు.రాత్రి సమయములో విద్యుత్ దీపాల కాంతులతో దేధిప్యమానంగా, చూడటానికి చాలా అందంగా మరియు కోలాహలంగా ఉంటుంది.


పిల్లలకి  కూడా ఈ ఫెస్ట్ కి ప్రవేశం ఉంది. ఇక్కడ బీర్ టెంట్లతో పాటు చాలా రకాల రైడ్లు ఉంటాయి. మాకు రైడ్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం. మేము అక్కడ పెద్దల కోసం ఉన్న అన్ని రైడ్లు ఎక్కాము . మొదట ఒకింత భయం వేసినా, తర్వాత బాగా ఎంజాయ్ చేసాం .ఇక్కడ బోలెడు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. రకరకాల పండ్లని పుల్లకి గుచ్చి చాక్లెట్ (మిల్క్ చాక్లెట్వై/వైట్ చాక్లెట్,/ డార్క్ చాక్లెట్ )లో ముంచి దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తారు. మరియు ఇక్కడ లాంగోస్ అనే పేరుతో పెద్ద పూరీలా ఉండే వంటకం ఒకటి రుచి చూసాము .దాని మీద  చీజ్ కానీ, వెల్లులి కారం కానీ, చాక్లెట్ సాస్ వంటివి వేసి మనకి అందిస్తారు . ప్రెజెల్ అనే బ్రెడ్ ఇక్కడి స్పెషల్ . 


 మన ఎక్సిబిషన్ లానే ఇక్కడ కూడా గేమ్ స్టాల్ల్స్ ఉంటాయి, మేము 5 యూరోలు పెట్టి ఆట ఆడి 1 యురో బొమ్మ గెల్చుకున్నాం. ఈ ఫెస్ట్ ఆఖరి రోజున రాత్రి 20 నిమిషాల పాటు పాటలతో వాటి అనుగుణంగా బాణాసంచాని కాలుస్తారు. ఇది చూడటానికి  ఎంతో బాగుంటుంది. కుటుంబంతో ఒక రోజు సరదాగా గడపవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో జరిగే ఎక్సిబిషను వంటిది , కాకపొతే ఇది కొంచెం పెద్దది. ఇవీ అక్టోబర్ ఫెస్ట్ యెక్క విశేషాలు. తిరిగి ఇంకొక సందర్శన స్థలం తో మీ ముందు ఉంటామండీ, ధన్యవాదములు .  


No comments:

Post a Comment