కావాల్సినవి:
బియ్యం - 1 కప్పు, పచ్చి శనగపప్పు- 3 టేబుల్ స్పూన్లు , సగ్గుబియ్యం - 3 టేబుల్ స్పూన్లు ,యాలకలు- 2/3, నెయ్యి- 4 స్పూన్లు, పాలు - 2 కప్పులు , బెల్లం - 1 కప్పు లేక 3/4 కప్పు, జీడిపప్పులు- 5-8, కిస్మిస్- 5, బాదంపప్పు- 5, ఉప్పు - చిటికెడు
తయారీ :
ముందుగా బియ్యాన్ని, పచ్చి శనగపప్పుని, సగ్గుబియ్యాన్నినీళ్లలో అరగంట నానబెట్టాలి. అడుగు మందగా ఉన్న గిన్నె తీసుకోవడంవలన పొంగలి అడుగు అంటకుండా ఉంటుంది. స్టవ్ మీద గిన్నెని ఉంచాలి అందులో 1.1/2 కప్పుల నీరు మరియు 1 కప్పు పాలు కాగబెట్టాలి. పొంగు వస్తునప్పుడు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిపప్పు మరియు బియ్యాన్ని అందులో వేసి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి, మధ్య మధ్య లో కలయబెట్టడం మర్చిపోకండి .
బియ్యం ఉడికాక బెల్లం, దంచిన యాలుకల పొడి మరియు ఒక కప్పు పాలు పోసి దగ్గరికి వచ్చేదాకా కలుపుతూఉండాలి. తరువాత చిన్న కడాయిలో నెయ్యిపోసి జీడిపప్పు, బాదం మరియు కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేపిన డ్రై ఫ్రూట్ లు , చిటికెడు ఉప్పు మరియు నెయ్యి పొంగలిలో వేసి ఒకసారి కలపాలి.అంతేనండి కమ్మని పొంగలి తయారయ్యింది . దీనీలో ముద్దపప్పు, నెయ్యి వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది.
గమనిక:
- కొత్త బియ్యంతో పొంగలి చేస్తే జిగురు ఉండి ఇంకా రుచిగా ఉంటుంది.
- తీపి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. .
- ఉప్పు వేయడంవలన తక్కువ బెల్లంతో తీపి సరిపోయినట్లు అనిపిస్తుంది.
- కొంచెం పచ్చికొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment