కావాల్సినవి :
రవ్వ-1/2 కప్పు, పంచదార -1/2 కప్పు, జీడిపప్పులు -5, బాదం -5, కిస్మిస్ -5, నీళ్లు -1/2 కప్పు, కేసరి రంగు -చిటికెడు, పాలు-1 కప్పు, నెయ్యి- 4 స్పూన్స్ ,యాలకలు -2.
తయారీ :
ముందుగా కడాయిలో 2 స్పూన్ల నెయ్యి పోసి జీడిపప్పులు, బాదం మరియు కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకోని వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో రవ్వ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి.
తర్వాత నీళ్లుని, కేసరి రంగుని మరియు పాలని కలుపుకుని, కొద్ది కొద్దిగా రవ్వలో పోస్తూ 5 నిమిషాల పాటు తిప్పుతూఉండాలి. దీనివల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. తరువాత పంచదార వేసి దగ్గరగా అయ్యేదాక కలుపుతూ ఉండాలి.
దగ్గరగా అయ్యాక మిగిలిన రెండు స్పూన్ల నెయ్యి, దంచిన యాలకలు పొడి మరియు వేయించిన జీడిపప్పులు, బాదం మరియు కిస్మిస్ వేసి ఒకసారి కలయబెట్టాలి.అంతే మీ ముందు రుచికరమైన పాలరవ్వ కేసరి రెడీ..
సర్వింగ్: 2/3 కప్పులు
No comments:
Post a Comment